పొడుపు కథలు
పొడుపు విడుపు
అణాకాణి మేక , దాని బొచ్చు నువ్వు పీక టెంకాయ పీచు
అర్ధరూపాయి మేక , దాని సంక నువ్వు నాక అన్నం తినే పళ్ళెం
అంబులో పుట్టింది, జంబులో పెరిగింది
అరచెయ్యికొచ్చింది, అంతరించిపోయింది
పేను
ఆకాశం అప్పన్న, నేల దుప్పన్న
ముడ్డి పిసుకన్నా, మూతి నాకన్న
మామిడి పండు
ఆకు అలము కాదుకాని ఆకుపచ్చన
కాయసున్నం కాదుకాని నోరు ఎర్రన
చిలుక
ఆకాశం లో అరవై గదులు, గదికి ఒక సిపాయి తేనె పట్టు
కానరాని అడవిలో నీళ్ళు లేని మడుగు
నీళ్ళు లేని మడుగులో కానరాని నిప్పు
ఆకలి
కిందొక పలక
పైనొక పలక
పలకల నడుమ
మెలికల పాము
నాలుక
తామరకమలం మీద కలువ పువ్వులు
కలువ పువ్వుల కింద సంపెంగ పువ్వు
సంపెంగపువ్వు కింద దొండపళ్ళు
దొండపళ్ళలో మల్లెమొగ్గలు
మొహము,
కళ్ళు,
ముక్కు,
పెదవులు, పళ్ళు
పిల్లికి ముందు రెండు పిల్లులు
పిల్లికి వెనక రెండు పిల్లులు
పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి
మొత్తం పిల్లులెన్ని ?
మూడు
ముందరి పేజి      తరువాతి పేజి