పొడుపు కథలు
పొడుపు విడుపు
నేలమొలవనితుంగ
కుమ్మరివాడు చెయ్యని కుండ
చాకలివాడు చెయ్యని చలువ
వానకురవని నీళ్ళు
కొబ్బరి కాయ
చింపిరి చింపిరి గుడ్డలు
కానీ ముత్యాలవంటి బిడ్డలు
మొక్కజొన్నపొత్తి
పొంచినదెయ్యం
పోయినచోట ప్రత్యక్షం
నీడ
వేసింది ఏమిరా - తీసింది ఏమిరా
వేలుపెట్టి వాసన చూసింది ఏమిరా
వేసింది సానరా - తీసింది చెక్కరా
వేలుపెట్టి వాసన చూసింది గంధం రా
నాలుగు కాళ్ళ నటారి
తోక లేని తొటారి
మంచం
అంగట్లొ ఉంటాను
అంగీ ఇంట్లొ విప్పుతాను
ఎవరన్నా పట్టుకుంటే
నూతిలో దూకుతాను
అరటి పండు
అంగట్లో పెట్టి అమ్మేది కాదు
తక్కెట్లో పెట్టి తూచేది కాదు
అది లేకుంటే పండగే జరుగదు
ఆవు పేడ
అడవి లో మాను ఎంత కోసినా ఎదుగుతుంది జుట్టు
అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం ఉల్లి పాయ
అడ్డగోడ మీద ముద్దపప్పు
అటు తోసినా పడదు. ఇటు తోసినా పడదు
ఎద్దు మూపురం
ముందరి పేజి      తరువాతి పేజి