| కావలసిన పదార్ధాలు: 300 గ్రాముల బాసుమతి రైస్, నాలుగు గుండ్రం వంకాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, సరిపోయే పచ్చిమిర్చి,రెండు పెద్ద క్యారెట్, ఒక చెంచా జీలకర్ర, కావలసిన జీడిపప్పు,ఉప్పు,కారం, వెల్లుల్లిపాయ, ఒక ఆలుగడ్డ, అరకప్పు కొబ్బరి తురుము, పావు కప్పు నెయ్యి, ఒక్క చెంచా గరం మసాలా పొడి. |
| ఇక మా ఆవిడ ఈ శాకం తయారు చేసే విధానం - ముందుగా బాసుమతి బియ్యాన్ని కొంచెం నూనెలో వేయించి, ఆలుగడ్డ ముక్కలుగా కోసుకుని అదే నూనె లో కొద్దిగా వేయించి, ఆ బాసుమతి బియ్యంలో కలిపేసి అన్నం వండి పక్కన పెట్టుకుంటుంది. క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలను కూడా చిన్న ముక్కలుగా కోసుకుంటుంది. ఒక ఇండాలియం మూకుడులో నెయ్యివేసి ఒక మోస్తరుగా వేడెక్కాక అందులో జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి వేసి కొద్ది సేపు వేయించిపారేస్తుంది. |
| తర్వాత అదే మూకుడులో ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ ముక్కలను వేసి వేయిస్తుంది. ఆఖరిగా కొబ్బరి వేసి ఆ పదార్ధం అంతా వేగాక ఉప్పు, కారం వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలయ పెడుతుంది. అదండీ మా ఇంట్లో వంకాయ పులావు సంగతి . |