| కావల్సిన పదార్థాలు: 2 కట్టల తోటకూర, ఉల్లిపాయలు - కావలసినంత, 2 టమోటాలు, చాలినంత చింతపండు గుజ్జు, చెంచాడు కారం, తగినంత ఉప్పు, కొంచెం పంచదార, తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, తగినన్ని తిరగమోత గింజలు, కొత్తిమీర. |
| ఇక మా ఆవిడ ఈ శాకం తయారీ చేసే విధానం: ముందు తోటకూరను శుభ్రంగా సింకులో నీళ్ళు నింపి కడిగేస్తుంది.ఆ తర్వాత సన్నగా తరిగి "తరుగు" చేసుకుంటుంది. ఓక్కోసారి సన్నగా తరిగేసి ఆ తరువాత కడుగుతుందండోయ్. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకుంటుంది. |
| ఆ తర్వాత ఓ లోతైన గిన్నెలో నూనె వేసి కాగనిచ్చి తిరగమోత వేసి ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా వేగిన తర్వాత తోటకూర వేసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు కారం వేసి గ్లాసు నీరు పోసి ఉడికిస్తుంది. బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం పంచదార, కొత్తిమీర వేసి దింపుతుంది. అంతే ఇక నేను ఎంతగానో ఇష్టపడే తోటకూర పులుసు తయార్.లొట్టలు వేసుకుంటూ తినెయ్యటమే. |