| కావలసిన పదార్థాలు: బియ్యం రెండు గుప్పిళ్ళు, ముదురు బెల్లం తురుము పావుకిలోకి కొంచెం తక్కువగా, యాలక్కాయలు 3, యాలకుల గింజలు పొడి ఒక చెంచా ,నెయ్యి - తినే రుచికి సరిపడినంత, సుమారుగా 3 పెద్ద చెంచాలు,వేయించిన జీడిపప్పు కావలసినంత |
| ఇక ఈ చక్ర పొంగలి మా ఆవిడ చేసే విధానం:ముందుగా బియ్యం కడిగి ముప్పావుగంట నాననిచ్చి,తరువాత అన్నం ఎసట్లో పడేస్తుంది.ఇక అన్నం అయిపోవస్తుంది అనగా అందులో తురిమిన బెల్లం వేసి మొత్తం కరిగేవరకు ఉడికిస్తుంది.వేయించిన జీడిపప్పు, యాలక్కాయలు, యాలకులపొడి, నెయ్యి అన్నంలో కలిపి ఒక రెండు నిముషాలు ఉంచి తీసెయ్యటమే. |