"శ్రీ వారాల ఆనంద్"



కరీం నగర్లోని హనుమాన్ నగర్ వాస్తవ్యులయిన మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారి రచనలు మీ ముందుకు తీసుకునిరావటానికి అవకాశం లభించినందుకు ఆనందిస్తూ, ముందుగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఆనంద్ గారు కరీం నగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు. ప్రముఖ రచయిత. తెలుగు లో ఎం.ఏ చేసి, లైబ్రరీ సైన్సులో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకున్న ఆనంద్ గారు శాతవాహన సెంటర్ ఫర్ కరీం నగర్ లిటరేచర్, కల్చర్ అండ్ హిస్టరీ స్థాపించి అందులో వందలు వేలాది పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆయన రాసిన నవ్య చిత్ర వైతాళికులు పుస్తకం హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 1999 కార్యక్రమంలో రిలీజ్ చేయబడింది. ఇవే కాక బాలల చిత్రాలు, సినీ సుమాలు మొదలయిన రచనలు చేసారు. ఎన్నో డాక్యుమెంటరీ ఫిల్ములు చిత్రీకరించారు. స్వతహాగా ఫిల్మ్ క్రిటిక్, విలేఖరి అయినటువంటి ఆనంద్ గారు ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సెక్రటరీగా తన వంతు బాధ్యత ఎంతో సమర్థంగా నిర్వహించారు, ఈనాడు మొదలయిన దినపత్రికలకు పనిచేసారు.ఆయన సాయంతో కరీం నగర్ ప్రాంత ఇతర రచయితల పుస్తకాలు కూడా మీ ముందుకు తీసుకునిరావటానికి ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ , వారాల ఆనంద్ గారిని ఈ క్రింది చోట్ల సంప్రదించవచ్చు అని తెలియచేసుకుంటున్నాను

VARALA ANAND,
8-4-641,
HANUMAN NAGAR ,
KARIMNAGAR-A.P.
INDIA

varalaanand @ yahoo.com, varalaanand @ gmail.com

phone: 9108782235897, CELL : 919440501281



మానేరు తీరం
సినీ సుమాలు