మీగడ తరకలు

'వెంకట్రామయ్యగారు గారికీ '


ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్యగారు మంచి హాస్యప్రియులు. ఆయన హై స్కూల్ చదువు పూర్తయ్యాక చీరాల తాలూకాఫీసులో కొద్ది రోజులు గుమాస్తాగా పనిచేశారు. ఏదో సందర్భంలో ఆ ఊరి పెద్దాయన ఒక పత్రం మీద సంతకం చేస్తూ 'వెంకట్రామయ్య గారు వ్రాలు ' అని వ్రాశారు. తర్వాత ఆయనకు ఆఫీసు నుంచి దాని తాలూకు కాగితం ఏదో పంపవలసి రాగా గోపాలక్రిష్ణయ్య గారు కవరు మీద 'వెంకట్రామయ్యగారు గారికీ' అని వ్రాశారు. దానితో ఆ పెద్దాయనకు కోపం వచ్చి, కవరుతో సహా ఆఫీసుకు వచ్చి పై ఆఫీసరుకు ఫిర్యాదు చేశారట. గోపాలక్రిష్ణయ్య గారు 'ఆయన సంతకంలో 'గారు ' అని పెట్టారు. అది చూసి వారి పేరులో గారు ఉందనుకున్నానండీ ' అని అన్నారట.


www.maganti.org