| పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు, తాము జరిపిన ఒక శతావధానము లోని "చంపకమాల" పద్యం |
| కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా |
| హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట |
| ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా |
| దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్ |