మీగడ తరకలు

సంపత్ కవిత


శంఖవరం సంపత్ రాఘవాచార్య బళ్ళారి ప్రాంతంలో తెలుగు లెక్చరర్‌గా ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆధునిక భావాలు గల ఈ కవి ప్రతిభ శ్రీశ్రీ సమానమని అంటారు. ఈ సంపత్ కవిత ఇది -


"రుద్రనేత్రం తెరచిచూస్తే
మృత్యుగానపుటులూకాలు
మర్మఘాతుక శలాకాలు
గుండెరేకులు చీల్చివేస్తూ
జీవసారం పేల్చివేస్తూ
స్వప్న సౌధం కూల్చివేస్తూ
హృదయమును రణభూమి చేస్తాయి
ధ్యాననేత్రం తెరచి చూస్తే
ప్రేమకెత్తిన ధూపధామం
చిత్తరఋషి యజ్ఞహోమం
సుప్తధాత్రీ స్వప్నధామం
సకలభువనాలుద్గమిస్తూ
సోమకలశాలుధ్భవిస్తూ
ఆత్మనయనాలు జ్జ్వలిస్తూ
హృదయకర్ణికలో నటిస్తాయి"


- ఈ కవిత శీర్షిక "దర్శన పరీక్ష".


డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి


www.maganti.org