మీగడ తరకలు

గడ్డం బాధ!


ఒకసారి సి. వి. సుబ్బన్న శతావధాని గారు అష్టావధానం చేస్తున్నారు. అప్రస్తుతప్రసంగం చేసే వ్యక్తి చూస్తూ ఊరుకోడు కదా! " ఏమండీ అవధాని గారూ, మనం ఒక గడ్డం గీసుకోలేకే చాలా బాధలు పడుతున్నాం కదా! మరి రావణాసురుడు పది గడ్డాలతో ఎలా బాధపడి ఉంటాడో! " అని అడిగాడు. వెంటనే అవధాని తడుముకోకుండా, " రావణాసురుడికి పదిగడ్డాలతో పాటు ఇరవై చేతులు కూడా వున్నాయని మర్చిపోయారా? అయినా, రావణాసురుడికి ఆ బాధ ఉండి ఉండదు దేవతల్ని పిలిచి గడ్డం గియ్యండర్రా అంటే చకచకా గీసెయ్యరూ! " అని చమత్కరించారు.


Source: డాక్టర్ ద్వా.నా.శాస్త్రి


www.maganti.org