| స్వర్గీయ మల్లినాథ సూరి గారు (కృష్ణా పత్రిక) ఒక వేసంకాలం బంధువుల పెళ్ళికి వెళ్ళిరావటం, ఆ నెలలోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టించటం మూలాన ఖర్చు చాలా అయ్యిందిట.అప్పుడు వారు కట్టి పాడిన పాట |
| మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా!! |
| రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా!! |
| పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి |
| బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు !!రామ!! |
| ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక !!రామ!! |
| ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు |
| కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను !! రామచంద్రా !! |
| ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె |
| టిక్కట్టు నేకొంటి రామచంద్రా |
| టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు !!రామ!! |
| ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు !!రామ!! |
| మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు !!రామ!! |
| లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి !!రామ!! |
| కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి !!రామ!! |
| కాయలు స్వయముగా |
| చేయి చేసి తరిగితి !!రామ!! |
| ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి |
| వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని !!రామ!! |
| కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా !!రామ!! |