| ******************************************************* |
| వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా |
| పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా |
| చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట |
| చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట |
| వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా |
| వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా |
| పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా |
| ప్రమిదలో నూనె ఉన్నవరకే దీపమెలుగునంట |
| ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట |
| వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా |
| వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా |
| పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా |
| పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనంట |
| మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట |