| సీతమ్మవారికి, హనుమ తెచ్చిన ఉంగరానికి జరిగిన సంభాషణ మన జానపదులు ఎంత హృద్యంగా తీర్చిదిద్దారో చూడండి. ఈ పదం నాకు పంపించిన మాలినిగారికి ధన్యవాదాలతో . |
| ******************************************************* |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| మా రంగయిన రాములేలుంగారామా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| యే కాకెత్తుకొచ్చేన ఉంగారమా |
| నిన్ను గద్దెత్తుకొచ్చేన ఉంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| కాకెత్తుక రాలేదు ఉంగారమా |
| నన్ను గద్దెత్తుక రాలేదు ఉంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| మరి యేదోవ నొస్తివే ఉంగారమా |
| నీవే దోవనొస్తివే ఉంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| రామయ్య అంపగా ఉంగారమా |
| హనుమయ్య తెచ్చెనే నన్ను ఉంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ఉంగారమా ముద్దుటుంగారమా |
| ******************************************************* |