| ఒక మంచి తత్త్వం ఇక్కడ చూడండి. |
| ******************************************************* |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| సాజన్మా సాకారా సద్గురుని గనరా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| పంచాక్షరీ మంత్రం పఠనా చెయ్యన్నా |
| పఠనాజేసితె యముడూ పారిపోనన్నా |
| యముడూ పారీపోతే అంబ ఫలమిచ్చురన్నా |
| ఫలము పొందినవాడు పరమగురుడన్నా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| సాజన్మా సాకారా సద్గురుని గనరా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| మూడారు వాకిళ్ళు మూయవలెనన్నా |
| ముక్తివాకిట నిలచి తలుపుతీయన్నా |
| తలుపూదేస్తే అంబ తేజమిచ్చన్నా |
| తేజామందినవాడూ తానేగురుడోయన్నా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| సాజన్మా సాకారా సద్గురుని గనరా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| ఆరూపదులా మీద అంబ ఉందన్నా |
| అంబాతో దుర్గాంబ ఆటలాడునన్నా |
| ఆటలో నిజము దాగిఉందన్నా |
| నిజముతెలిసినవాడు హరిగురుడోయన్నా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| సాజన్మా సాకారా సద్గురుని గనరా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| నాశికములో దృష్టి నడిపించుమన్నా |
| నడిపించి మరినీవు నమ్మియుండన్నా |
| నమ్మి నవరత్నాల పీఠమెక్కన్నా |
| పీఠమెక్కిన నిన్ను అంబ పిలుచునోయన్నా |
| పిలిచినంతనే నీవు నిలుచుమన్నా |
| నిలచినంత నీవె నిజగురుడోయన్నా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| సాజన్మా సాకారా సద్గురుని గనరా |
| ఈ జన్మమిక దుర్లాభమురా |
| ******************************************************* |