| శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు తెగగొట్టగా, తన అన్న రావణుని వద్దకు వెళ్ళి తన అవమానానికి ప్రతీకారంగా సీతని చెరబట్టమని అడిగే ఈ చెక్కభజన పాట చూడండి |
| ******************************************************* |
| అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |

| చిత్రకూట వనములోన జరిగినసంగతీ నాయకా |

| దశరధాపుత్రులంటా రామలక్ష్మణులిద్దరూ |
| దశరధాపుత్రులంటా రామలక్ష్మణులిద్దరూ |
| వారితో కలియరమ్మని కష్టపెట్టిరి మనుజులు |
| వారితో కలియరమ్మని కష్టపెట్టిరి మనుజులు |
| అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
| ఒప్పుగా నే విన్నవించితి గొప్పవారనుకొంటినీ |

| గొప్పవారు తాము కాదని బలమునా నన్ను బట్టిరీ |
| గొప్పవారు తాము కాదని బలమునా నన్ను బట్టిరీ |
| అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
| బలమునా నను బట్టిరీ నాకు భంగము కావించిరీ |

| ముకు చెవులు కోసెనా వాని తమ్ముడు లక్ష్మణా |
| ముకు చెవులు కోసెనా వాని తమ్ముడు లక్ష్మణా |
| అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
| సీత అన్న పడతి ఉన్నది ఆమె రూపము |
| సీత అన్న పడతి ఉన్నది ఆమె రూపము |
| చెప్పశక్యము కానిదీ చెప్పశక్యము కానిదీ |
| చెప్పశక్యము కానిదీ చెప్పశక్యము కానిదీ |
| అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
| ఆమె లావణ్యము వర్ణించుట బ్రహ్మతరములు కానిదీ |

| ఎటులయిన ఆ సీతనిప్పుడు వేగమే చెరపట్టుమా |