| ************************************************************ |
|
మంగళముపాడరే రంగలరంగను సంగీతభంగిని !! మంగళము !! |
|
భృంగీశసంగీత భంగీవినోదికి రంగలరంగ సారంగలోచనలు!! మం!! |
|
సంగరహితప్ర సంగముమాగునొ సంగుటమటంచును సంగ శూన్యునకు!! మంగళము !! |
|
రంగదుత్తుంగ తరంగానుగాంగత రంగాలవాలవ రాంగాభి శోభికి!! మంగళము !! |
|
మంగళకైలాస శృంగనివాసికి రంగలరంగ మీరంగన లిప్పుడు!! మంగళము !! |
|
భంగములెల్లనుభంగపరచివే గంగరుణించెడు గంగాభకాంతికి!! మంగళము !! |
|
రంగద్విలాసా రంగపాణికిని శృంగారశృంగాట కాంగాభిశోభికి!! మంగళము !! |
|
మంగళశ్రీసర్వమంగళాసంగికి రంగన్మహోక్షతు రంగునకి మీరు !! మంగళముపాడరే !! |
| ************************************************************ |
|
|