| ******************************************************* |
| చీటికి మాటికి చిట్టెమ్మంటే |
| చీపురుదెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడ |
| చిన్నోళ్ళుంటరు పెద్దోళ్ళుంటరు |
| కాపులుంటరు కరణాలుంటరు |
| నను చిట్టెమ్మ అని పిలువకురో రయ్యో కొయ్యోడ |
| నే కుందుం నాయుడు కూతుర్నిరో రయ్యో కొయ్యోడ |
| అబ్బా అబ్బా అలాగయితే |
| కొయ్యోడంటూ కూశావంటే |
| కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టమ్మీ |
| నువ్వు కొరడా దెబ్బలు తింటావే చిట్టమ్మీ |
| మళ్ళీగాని మాటలాడితే |
| మడమ తాపులు తింటావే లమ్మీ చిట్టమ్మీ |
| నే మద్దప్పయ్యా మనవడినే లమ్మీ చిట్టమ్మీ |
| ******************************************************* |