| కాటమరాజు కథలో యాదవులు బొల్లావును యే విధంగా అలంకరించారో, దానిని మన జానపదులు తమ పదాలలో ఎంత హృద్యంగా వివరించారో చూడండి. |
![]() |
| *************************************** |
| పసిడి బిందెలనీట పాదముల్ కడిగి |
| అందంబుగా వెదురాకు చందంబున |
| తిరుమణి తిరుచూర్ణము దిద్దిరి తోడ |
| నలదిరి మేనున నగరుగంధంబు |
| నటు పునుగు జవ్వాజి యలదిరి చాల |
| సురయించి కస్తూరి సురటుల విసిరి |
| నాల్గుపాదంబుల నాదుటందెలను |
| మెండుగా వేసిరి మేలుగంటలును |
| రత్నాలు దాపిన రావిరేకలును |
| తళతళ మెరియంగ ధరియింపజేసి |
| కొమ్మున బంగారు కుప్పెను దొడిగి |
| రహిమించ మెడచుట్టు రంగుగానపుడు |
| గోమేధికంబుల గొలుసులను వేసె |
| మురువైన ముత్యాల మువ్వల పేర్లు |
| గంటల సరసను ఘనముగా వేసె |
| మూపురమునకు జుట్టు మురువు గజ్జెలును |
| సన్నగజ్జెలు వేసె సందు సందులను |
| *************************************** |
| Keywords: kATamarAju katha, yAdavulu bollAvu alankaraNa, gOvula alankaraNa, jAnapada sAhityam, jAnapada pATalu |