" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఆయన ఆంధ్రుడే. రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రానడేల కోవకు చెందిన ఆంధ్రుడు. భారతీయ మహనీయులలో ఒకడు. సంఘసంస్కరణల కోసమే జన్మించిన కారణ జన్ముడు - అని ఎందరెందరో ప్రశంసించారు.

ఆయన ఎవరో కాదు - 16-4-1848 న జన్మించిన కందుకూరి వీరేశలింగం పంతులుగారు !

ఈ చిత్రంలో కనిపించే ఇంట్లోనే కందుకూరి జన్మించారు. ఈ స్వగృహం గురించి ఆయన తమ స్వీయ చరిత్రలో ఇలా రాసుకున్నారు -

"మా ఇల్లు రాజమహేంద్రవరంలోనున్న పెద్ద ఇండ్లలో నొకటి. దానితో సమానమైన ఇండ్లా పట్టణములో రెంటి మూటి కంటెనధికముగా లేకుండెను. నేను జన్మించిన గది నా పాలికి వచ్చిన మేడ ఇంటిలోనేయుండి నాయధీనములోనేయున్నది. నా రాజశేఖరచరిత్రము (నవల) నందలి రాజశేఖరుడుగారి గృహ వర్ణన ఇంచుమించు మా గృహవర్ణనమే"

ఈ గృహమే మీరు చిత్రంలో చూస్తున్నారు. మరో రాష్ట్రంలో, మరో దేశంలో అయితే ఈ ఇల్లును సంరక్షించి - వారసత్వ సంపదగా భద్రపరచరూ ? ?

గురజాడ "మనవాళ్ళొట్టి వెధవాయలోయ్" అంటే కోపమెందుకు ?
www.maganti.org
All Rights Reserved