" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఈ చిత్రంలో కూర్చున్నవారు ఒక తత్వవేత్త, ఒక ఉపాధ్యాయుడు. మన దేశానికి రాష్ట్రపతిగా ప్రపంచంలో గౌరవం పొందినవారు. నుంచొన్నవారిలో ఎడమనుంచి మొదటి వ్యక్తి మన తెలుగు కవి. ఇదొక అపూర్వ అనుభూతిని భద్రపరిచే చిత్రం. ఆ తెలుగు కవి కళాప్రపూర్ణ జ్ఞానానందకవి ! సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన సదనానికి వెళ్ళి జ్ఞానానంద కవిగారు తెలుగు కవిత గానం చేస్తుంటే సర్వేపల్లి వారు శ్రద్ధగా వింటున్నారు. విని కవిగారిని సత్కరించారు. అభ్యుదయ భావాలను పద్యంలో పలికించిన కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారు !
www.maganti.org
All Rights Reserved