" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "
కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు. దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

పర్సనల్ ఆల్బం నుండి అపురూపమైన చిత్రాన్ని అందించిన శ్రీ సుధామ గారికి వేల కృతజ్ఞతలతో