ధూళిపాళ శ్రీనివాస్ (వీణా శ్రీనివాస్)

మిత్రులు ధూళిపాళ శ్రీనివాస్ అద్భుతమయిన సంగీతాభినివేశం ఉన్న వ్యక్తి. సంగీతమయమయిన కుటుంబంలో పుట్టిన ఆయనకి వీణ అంటే పంచప్రాణాలు. ఆయన్ని అందరూ ముద్దుగా "వీణా శ్రీనివాస్" అనే పిలుస్తారు.చేతిలో మైనపు ముద్దలా ఒదిగిపోయే వీణతో తొమ్మిదేళ్ళ వయస్సులోనే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో వీణానాద ప్రదర్శన ఇచ్చిన ఉత్తుంగతరంగమది. అప్పటినుంచి అప్రతిహతంగా వెనుతిరిగి చూడకుండా ఎప్పటికీ మనసుకి హాయిగొలిపే చల్లని పిల్లగాలి తెమ్మెరెలా సాగిపోతోంది ఆ వీణా నాదం. ఈయన తల్లిగారు, మొదటి గురువు శ్రీమతి తులసి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసురాలు. అలా మొదలయిన ఆ సంగీతయాత్ర, అతిపిన్నవయస్సులో అంటే 23 యేళ్ళ వయస్సులోనే ఆకాశవాణిలో "A" గ్రేడ్ ఆర్టిస్ట్ గా "నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మ్యూజికల్ కాన్సర్ట్" వంటి ఎన్నో జాతీయ స్థాయి ప్రదర్శనల్లో తన వీణానాదంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళిగారి "త్యాగరాజ కృతులు" సి.డి కి వీణ సహకారం అందించటంతో పాటు, మాండోలిన్ శ్రీనివాస్ గారితో కచేరీల్లో పాల్గొంటూ, పద్మశ్రీ రాజారెడ్డి, రాధారెడ్డి గార్ల కూచిపూడి నాట్యవైభవం అనే 13 భాగాల ప్రోగ్రాంకి సంగీతం సమకూర్చారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆ సంగీత యాత్రలో ఇంకా ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి.
ఆ కళామతల్లికి తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూ ఉండాలి అని ఎంతో వినమ్రంగా చెప్పే ఆయన , తన వీణానాదంతో, సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటూ, అడిగిన వెంటనే కొన్ని ముత్యాలు మీతో పంచుకోమని అందించిన మిత్రులు శ్రీనివాస్ కి సహస్ర ధన్యవాదాలతో...
ఇంకా మరిన్ని విశేషాల కోసం ఆయన స్వంత వెబ్సైటు వీణా శ్రీనివాస్ చూడండి



మరుగేలరా ఓ రాఘవా




"అలై పయ్యుదె" - ఆది తాళం - వెంకటసుబ్బయ్యర్




"స్వామినాధ" - నాట రాగం - ఆది తాళం - దీక్షితార్




"రామ భక్తి" - శుధ్ధబంగాళ రాగం - ఆది తాళం - త్యాగరాజ




www.maganti.org