|
శ్రీ ఓగిరాల వీర రాఘవ శర్మగారు (జ్ఞానానంద తీర్థస్వామి) గాయత్రీ అమ్మవారి ఉపాసకులు.తన పదహారో యేటనే తన గురువు శ్రీ నాథానంద తీర్థ గారి వద్ద మంత్రసిద్ధిని పొందిన మహామనీషి. వాగ్గేయకార రత్న బ్రహ్మశ్రీ హరి నాగభూషణం గారి వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్న వీరు తన జీవితాన్ని ఆ గాయత్రిదేవి పాదాలకు అంకితం చేసి, ఆ దేవి మీద 86 కృతులు రచించి 53 రాగాల్లో బాణీలు కట్టారు, ఆ పైన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గాయత్రి పంచాయతన పీఠం స్థాపించారు..కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శ్రీమత్ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిచేత ప్రత్యేక ప్రశంసలు పొందిన ఆ కృతులు మీ ముందుకు తీసుకుని రావటానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ, అవకాశం ఇచ్చినందుకు వారి అమ్మాయి శ్రీమతి బులుసు విమల గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇతర సమాచారం కావలసిన వారు విమల గారిని vimala_bulusu @ yahoo.co.in ఈమెయిలులో సంప్రదించవచ్చు. శ్రీ జ్ఞానానంద తీర్థస్వామి వారి గురించి మరిన్ని వివరాల కొరకు ఈ వెబ్సైటును సందర్శించండి |
|