"కన్యాశుల్కం" నాటిక
రచయిత: శ్రీ గురజాడ

ప్రజాశక్తి పత్రికలో అనుకుంటా "కన్యాశుల్కం" నాటిక గురించి ఇలా చెబుతారు - "సంఘ సంస్కరణోద్యమానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా వీరేశలింగం మలచుకుంటే, సాహిత్యాయుధంతోనే సంస్కరణ భావాలు విస్తృతంగా వెదజల్లడానికి కృషి చేసిన వారు మహాకవి గురజాడ. వీరు ఉభయులు యుగపురుషులు. తెలుగు నాటకానికి మార్గదర్శకులు. గురజాడ 'కన్యాశుల్కం' నాటకం అటు నాటక లక్షణాలను విశదపరచడంతో పాటు ఇటు తెలుగు నాటకానికి దిశానిర్దేశం చేసింది. ప్రగతిశీల సామాజిక మార్పులో నాటకం ఓ అద్భుత సాధనం కావాలని తపించింది. ఆ మార్గంలో దీర్ఘకాల విశేషకృషి సల్పి ఆచరణలో సుసాధ్యం చేయగలి గారు కనుకనే 'కన్యాశుల్కం' నాటకం తలమానికమైంది. ఆధునిక మహాకావ్యంగా అవతరించి తెలుగువాడిని తలెత్తుకునేలా చేసింది."

ఆ మహాకావ్యాన్ని నాటిక రూపంగా మలిచి ప్రసారం చేసిన ఆకాశవాని వారికి రేడియో అభిమానులు ఎంతో ఋణపడి ఉంటారు. ప్రధాన పాత్రలో కె.వెంకటేశ్వర రావు గారు నటించిన ఈ నాటకాన్ని ఆడియోగా అందించిన డాక్టర్ కె.బి.గోపాలం గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ