ఆంగ్ల రచయిత హెచ్.జి.వెల్స్ "టైం మెషీన్" స్ఫూర్తితో శ్రీ కె.చిరంజీవి గారు వ్రాసిన నాటకం "కాలయంత్రం". ఇరవైదేళ్ళ తర్వాత మనుషులు సమాజం ఎలా ఉండబోతున్నాయో ఊహిస్తూ వ్రాసిన నాటకం. ఆకాశవాణి వారు 1982 లో తొలిసారిగా ప్రసారం చేసారు. పునః ప్రసారం: అక్టోబరు 3, 2010

ఈ నాటకంలోని పాత్రలు ధరించింది వీరే:
సర్వశ్రీ ఎన్.రవీంద్రారెడ్డి
డి.హనుమంతరావు
కె.హనుమంతరావు
పి.నారాయణ
డాక్టర్ పి.రామారావు
డాక్టర్ సి.నరసింహ
రత్నాసాగర్
శారదా శ్రీనివాసన్
కె. చిరంజీవి
వాణి ఎల్.కె. రెడ్డి మొదలైనవారు
సంగీతం: ఎం.చిత్తరంజన్, ఎన్.ఎల్.సుభాష్, మనోజ్ కుమార్
సాంకేతిక సహకారం: నజీర్ అహ్మద్, విశ్వనాథం, వి.ఎస్ వాసన్

(1961 - 1993) కాలంలో ఆకాశవాణి హైదరాబాదు నాటక విభాగ కళాకారుడిగా పనిచేసిన శ్రీ కె చిరంజీవి గారు రాసిన ఆ నాటకం ఇదిగో మీ కోసం.

ఘనపురం దేవేందర్ గారు తన ఎం.ఫిల్ పట్టా కోసం తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించిన "శ్రీ కె.చిరంజీవి గారి రేడియో నాటికలు - పరిశీలన" అనే లఘు సిద్ధాంత వ్యాసంలో - "కాలయంత్రం" నాటకం గురించి ఇలా స్పృశిస్తారు.

పూర్తి సిద్ధాంత వ్యాసం
ఇక్కడ చూడవచ్చు. ఈ పూర్తి సిద్ధాంత వ్యాసం ఇలా ఇక్కడ ప్రచురించడమెవరికైనా అభ్యంతరకరమైతే తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను

శ్రీ రంజని గారి (తెలుగుథీసిస్.కాం) సౌజన్యంతో.
ఈ ఆడియోను అందించిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు


శ్రీ కె.చిరంజీవి గారి చిత్రం