శ్రీకృష్ణులవారి మేలుకొలుపులు




శ్రీకృష్ణులవారి మేలుకొలుపులు ఈ క్రింది పద్య రూపములో అందచేసిన మా అమ్మ శ్రీమతి మాగంటి ప్రసూన గారికి ధన్యవాదాలు. అమ్మమ్మగారు కమలమ్మగారి దగ్గరనుంచి తాను చిన్నప్పుడు నేర్చుకున్న పాట అని, ఈ విధంగా మీ అందరి ముందుకు తీసుకునిరావటానికి తనకి అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆవిడ ఈ పద్యం పంపిస్తూ చెప్పారు.

ఇందులో కృష్ణులవారి చెల్లెలు సుభద్ర, భార్యలు ఎలా మేలుకొలుపులకు వచ్చారో హృద్యంగా వివరించబడింది.ఇక చదువుకుని ఆనందించండి.

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
బంగారు చెంబుతో పన్నీరుపట్టుక పణతిరుక్మిణివచ్చే మేలుకో
రంగైనపావలూ కెంగేలబూనూక రమణిసత్యాతోను మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
దంతాకాష్టము బూనీ తామారాసాక్షి సూదంతీ వచ్చీనదయ్యా మేలుకో
అంతాకుమున్నూ రూమాలాబట్టుక జాంబావంతుని సుతవచ్చే మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
అందామయినా నిలువుటద్దామూగొని మిత్రావిందా వచ్చినదయ్యా మేలుకో
పొందుగాకస్తూరీ బరిణాబట్టుక కాళిందీవచ్చినదయ్యా మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
నూటిగా నీపైనీ పాటలు బాడుతూ సూభద్రా వచ్చినదయ్యా మేలుకో
వాలాయముగ తాంబూలము బట్టుకా రాధా వచ్చినదయ్యా మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
ముదమూతో వీణే వాయింపుచూ శ్రీలక్ష్మీ వచ్చినదయ్యా మేలుకో
పదియారువేలా గోపికలెల్లా సొగటాలా పాళిదెచ్చున్నారూ మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!

మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా
మేలుకో యశోదా నందాకుమారా మేలుకో శ్రీకృష్ణా మేలుకో
మేలుకో దయతోడా వేళాగావచ్చేను తెల్లవారవచ్చె మేలుకో
మేలుకో కృష్ణయ్యా, మేలుకోవయ్యా !!